Posts

Showing posts from March, 2011

హేమ వాళ్ళ అమ్మ గురించి !

Image
హేమ వాళ్ళ అమ్మ చాలా నెమ్మదిగా ఉండేది .హేమ కూడా చాలా నెమ్మదిగా ఉండేది .హేమ కి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం .వాళ్ళ అమ్మ చాలా నెమ్మదీగా ఉండేది ఇంకా మాకు ఐదు లీటర్ల పాలు ఇచ్చేది .మేము  చాలా హాయిగా ఉండేవాళ్ళం .హేమ రోజు వాళ్ళ అమ్మ పాలు తాగేది .ఒక రోజు హేమ వాళ్ళ అమ్మ పాలీడం మానేసింది .హేమాకి మాత్రం పాలిచ్చేది .అది ఎందుకయ్యిందంటే హేమా వాళ్ళ అమ్మకి గడ్డి తినడానికి లేదు . రోజూ పక్క బంగ్లాకి వేల్లాల్సోచ్చేది .తరవాత కొన్ని రోజులకి హేమ వాళ్ళ అమ్మని పంపేసారు కానీ హేమా మాత్రం ఉంది .హేమాకి చాలా దుఖం వేసింది .తరవాత కొన్ని రోజులకి కొత్త ఆవు వచ్చింది .దాన్ని చూసి హేమ ,వాళ్ళ అమ్మ అనుకుంది .ఆ కొత్త ఆవు హేమ వాళ్ళ అమ్మ లాగా చాలా నెమ్మది కాదు .తరువాత కొన్ని రోజులు రాజ మల్లికకి కోపం వచ్చి ఆ కొత్త ఆవు దగ్గరకి పోతూ ఉంది అప్పుడు నేను లక్కి ఆ కొత్త ఆవు దూడ దగ్గర ఉన్నాం .అప్పుడు ఆ ఆవు తాడు తెగి పోయింది .అయితే సుదాన్క్షు ఎంత చెప్పినా రాజాలు వినట్లేదు .అప్పుడు లక్కి నన్ను అట్ట లాగింది ఎందుకని చూస్తే ఆ ఆవు తాడు తెగిపోయింది .అప్పుడు నా కాళ్ళు వనకతా ఉండాయి .తరవాత అమ్మ వచ్చి రాజ మల్లికని లాగింది. తరవాత నా హేమా కోసం ఏమన్నా

పాత నందు !

నేను నందు ని చూసినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది .మా అమ్మ కూడా చాలా ఆనంద పడింది .రోజూ మా నాన్న దాన్ని భుజం పైన మోసేవాడు .అసలు అదెవరో మీకు తెలీదు అది ఒక రామ చిలుక .అయితే మా నాన్నకి తమ్లుక్ కి ట్రాన్స్ఫర్ అయింది .కానీ నందు అక్కడ లేదు నేను ఘోరంగా ఆశ్చర్య పడ్డా.బ్రిహస్పతి దానికి రెక్కలు కత్తిరించ లేదు .అది హటాత్ గా ఎగిరెలిపోయింది .అప్పుడు అమ్మ చాలా బాధ పడింది .అయితే అప్పుడు నాన్న రాధిక నందు అనే రెండు రామ చిలుకల్ని తెచ్చిచ్చాడు .అమ్మకి అప్పటికి కూడా దుక్ఖం కుదర లేదు. అయితే అది రోజు రోజుకి దగ్గర అవతా అవతా అమ్మ వళ్ళోకి వచ్చేసేది .తరువాత నాన్నకి కోచ్ బీహార్ కి ట్రాన్స్ఫర్ అయింది .మాకు కోచ్ బిహార్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మా కొత్త నందు ను మేం వదిలేసాం .ఎందుకంటె దానికి రెక్కలోచ్చాయి ,దానికి మనసులో బాధేస్తుంది ఎగరాలని .అయితే రెండు వారాలకి రాధిక కు కూడా రెక్కలోచ్చేసినాయ్.సరే అని రాదికాని కూడా వదిలేసాం .ఇంకట్లో కథ ఆపేసా ఇదే మాకు జరిగిన కథ .నేను కథ ఆపేటప్పుడు ఒక మాట చెప్తా ఉండా.ఆ మాట ఏందంటే మీరు ఎప్పుడైనా చిలకల్ని పెంచుకునేటప్పుడు చిన్న బిడ్డ రామ చిలకల్ని తెచ్చుకుని చిన్నప్పట్నుండి పెంచుకోండి రెక్కల

అమ్మ !

Image
అమ్మ కన్నా ప్రపంచంలో లేదు ఏమి లేదు .పుట్టినప్పుడు అమ్మంటే అందరికి ఇష్టం .ఏ బిడ్డైనా తల్లిని వదిలేసి ఉండలేదు .అందరు అమ్మని గౌరవంగా చూడాలి .ఎవరు అమ్మని అగౌరవంగా చూడకూడదు .అమ్మకి బాలేక పోయినా అమ్మని బాగా జాగ్రత్తగా చూసుకోవాలి .ఏ తల్లైనా అసయ్యంగా ఉండినా ఆ బిడ్డకి తల్లే కదా ?నేను మీకు ఇది లాస్ట్ చెప్తూ ఉన్నాను .ఎవరైనా అమ్మని అగౌరవంగా చూడకూడదు .

మహా విష్ణువు !

Image
ఆ పచ్చని గడ్డి లో నీలమైన కృష్ణుడు చెట్టు మీద .. పక్కనే యమునా నది ,చెట్టు మీద కృష్ణుడు కూర్చుని ఉన్నాడు ఆ నీలమైన రంగు,ఆ నీలమైన చేతులు ,ఆ నీలమైన ముక్కు ,ఆ నీలమైన కాళ్ళు ,ఆ నీలమైన మొహం యమునా నది వెనకాల పచ్చని చెట్లు కృష్ణ నీ ఆవులేవి అని అడిగినారు వాళ్లు చెట్టు మీద అందమైన కోయిలల పాట మల్లి కృష్ణుడు సంతోషంగా వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చాడు .

భూటాన్

Image
భూటాన్ లో జల పాతాలు చూసినప్పుడు చాల అందంగా అనిపించింది . మేము అక్కడికి చాల సార్లు పోతాం.