Posts

Showing posts from August, 2011

మున్ని బాల కష్టాలు !

Image
ఈమె పేరు మున్ని బాల.ఈమెకి చాలా కష్టాలు.ఈమెకి పగలోస్తే సాయంత్రం దాకా తిండి ఉండదు.ఈమె చాలా మంచిది.ఈమె గడ్డి కోస్తది.ఈమెకొక కొడుకు ఉన్నాడు .ఈమెకి చిన్నప్పుడే అమ్మ నాన్న చని పోయారు.కొడుకు పొట్టలో ఉండగా ఆమె భర్త చని పోయాడు.ఆమె భర్త బిల్డింగ్ పై నుండి పడి చనిపోయాడు. ఆమెకి ఒక ఫోటో ఉంది.మున్ మున్ సేన్ తో .మున్ని బాలని మున్ మున్ సేన్ వాళ్లు పనికి రమ్మన్నారు.అంటే ఆమె అన్నదీ నా బిడ్డని తీసుకు రావచ్చా ....అని.అంటే వాళ్లు అన్నారు..కాదు!అంటే ఆమె అప్పుడు గమ్మున ఉండి పోయింది.ఆమె యింక రాను అన్నది .తరవాత ఆమె మా ఇంటికి పనికి వచ్చింది .ఆమె నాతో చాలా బాగుంటది.నిజమైతే ఆమె పిలకాయలని చాలా బాగా చూస్తది. ఆమె కృష్ణుడి పూజలు చేస్తది.అసలు ఆమె పాటలు కూడా పాడద్ది.