Posts

Showing posts from 2012

షీలా పావడ !

Image
షీలా పావడ చాలా చినిగి పోయి వుంటది .దానికి  ఆమె పది సార్లు కుట్లు వేసింది .దానిని చూసి నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటె ఆమె దాన్ని అన్ని సార్లు కుట్టుకున్నది .ఆమెకసలు పావడలే లేవు.షీలా భర్త రిష్కా [షీలా అలాగే అంటుంది  ] తోక్కుతాడు. ఆయన చేతులు రిక్షా తొక్కి తొక్కి వంగి పోయాయి .ఆయన మన లాగా అన్నం తిన లేడు .షీలా వచ్చి ఒక బంగ్లా దేశీ . షీలా ఇల్లు రోవంత పగిలిపోయి వుంటది,రోవంత బాగుంటది .నిన్న మా అమ్మ ఒక పుస్తకం చదివింది .ఆ పుస్తకం పేరు ''అగ్నిసాక్షి'' రచయిత్రి పేరు ''లలితాంబిక అంతర్జనం'' .ఆమె అందరు పడుకున్న తరువాత ఒక దీపం బుడ్డి వెలిగించుకుని రాసేది .ఆ దీపం బుడ్డి పొగకి కళ్ళు మండిపోయినప్పుడు ఆమె కళ్ళు మూసుకుని రాసేది .ఆమె నంబూద్రి బ్రాహ్మణుల గురించి రాసింది .వాళ్ళ  నియమం ఏందంటే వాళ్ళ ఆడవాళ్ళు మాత్రం బయటికేల్లెటప్పుడు వొళ్ళంతా బట్ట కప్పుకుని  భుజాలు దాటి వుండే గొడుగు వేసుకుని వెళ్ళాల్సి వచ్చేది .పేద ఆడవాళ్ళు మాత్రం వక్షోజాలు [సంస్కృతంలో ఇలా అంటారని మా పెద్దఅమ్మమ్మ చెప్పింది ] బయటకి యేసేసి అందరు  మగవాళ్ళ ముందర తిరగాల్సి వచ్చేది. నేను దాని గురించి చాలా బాధ పడ్డా

దెయ్యాలు

Image
నేను సైకిల్ తోక్కుకుంటా పోతా ఉండాను.పక్కన్నే ఒక చెరువు ,పక్కనే ఒక గొంది ,ఆ గొంది దాటేసాను.గొందంతా బాగుంది .ఆ గొంది దగ్గర ఒక ఇళ్లుంది.ఆ ఇంటి పేరు 'పిట్నా ఘర్'అంటే దెయ్యాల ఇల్లు .ఆ ఇంట్లోకి వెళ్లాను.భయపడతా వెళ్ళెను.ఒక రెండు దెయ్యాలు వచ్చేయి .ఆ దయ్యాలు ఊ ..ఊ..అని అరస్తా వుండాయి.వాటిల్ని ఒక్క గుద్దు గుద్దాను.అవి కింద పడి పోయాయి .వాటిలి మొహానికున్న మాస్కులు తీసి చూస్తే అయి దెయ్యాలు కాదు మనుషులే .ఇంకో రూముకి ఎల్లాను .ఆ రూములో చాలా ధనం ఉన్నింది.అప్పుడు నేనా ధనాన్నంతా తీసుకున్నాను.కానీ మళ్ళీ పెట్టేసాను.ఆ తరవాతా నేను ఇంటికి పారిపోయాను .

తెలుగు నవ్వులు

Image
1. చెట్టు మీద జాంకాయ్ కాకి వెతుకు చుండే కింద ౨ . కిస్మిస్ అయిపోయే డబ్బాలో వాడు లోడుతుండే డబ్బాలోనే ౩ . భూమి అంతరించి పోయే మనుషులేడికి పోయే ౪. సూర్యుడు అంతరించి పోయే మనుష్యులేడికి పోయే ౫. గాలి పటము తెగిపోయే పిల్ల వాడు గాలిలోకే చూస్తుండే ౬. మెదడుని పురుగులు తినేసే వాడేట్టా ఆలోచించే ? ౭. పుస్తకాలు ఎలుకలు కోరికే వాడు కప్ బోర్డ్ లోనే లోడుతుండే ౮. కాపీ హ్యాండ్ రైటింగ్ రాయక పోతే అమ్మ తిట్టే ౯. చెట్లన్నీ అంతరించి పోయే మనిషేట్టా ఊపిరి పీల్చా ? ౧౦. అందరూ నిద్దర పోయా ఒక్కడు లేచి తిరగా ... ౧౧. నాట్యం కి విలువ ఇవ్వకపోతే ఇంక నాట్యం ఎందుకూ? ౧౨. పని వాడు మెట్టు మీద కూర్చునుండే ఇంక వానికి పనెందుకు ? ౧౩. ఫోటో లో అమ్మ ముద్దు మొహం పెట్టె అందరికీ నవ్వొచ్చే ౧౪. పాపాయి బుక్కులు అన్నీ రాసేసే ఇంక దేంట్లో రాస్తది? ౧౫. పాపాయి చెప్పులు చేతిలో పట్టుకునే ఇంక పాపాయికి ఎందుకు చెప్పులూ? ౧౫. పిచ్చుకలకి రెక్కలన్నీ ఊడిపాయీ ఇంక పిచ్చుకలు ఎట్ట ఎగరా ? ౧౭. తీసుకెళ్ళిన ఇరవై రూపాయల్లో పది రూపాయలై పాయె ఇంక నేనేట్ట బట్టలు కొనుక్కోవాలా? ౧౮. దర్జీ పాపాయికి బట్టలు కుట్టక పోతే ఆయన్నే పట్టి ప

అమ్మ మీద వ్యాసం !

Image
అమ్మ చాలా మంచిది . అమ్మ చాలా మందికి చదువు చెప్పింది . అమ్మ బాగా చదువుకున్నది . అమ్మ చాలా పుస్తకాలు చదువుతుంది . అమ్మ నాకు చాల పుస్తకాలు కొనిచ్చింది , ఒక అల్మారా నిండుగా ... అమ్మ చాలా ధర్మవంతు రాలు . అమ్మ నాకోసం పీ హెచ్ డీ , వుద్యోగం అన్నీ వదిలేసింది . ఇప్పుడు బెంగాల్ కి వచ్చి ఉంటా వుంది . అమ్మ కుక్కల్ని , చిలకల్ని , ఆవుల్ని బాగా ప్రేమిస్తది . పైగా కప్పల్ని కూడా ప్రేమిస్తది . అనాధా శ్రమానికి కూడా డబ్బు ఇస్తది . లోకంలో అందరి మీదా రిచ్ పీపుల్ , పూర్ పీపుల్ , మిడిల్ పీపుల్ .. లోకం లో అందరి మీదా కథలు , కవితలూ రాస్తది . అమ్మ అస్సలు టీవీ చూడదు . అమ్మ చదువుకుంటా వుంటది . అమ్మ దగ్గర గాన్ విత్ ది విండ్ అని ఒక నవల వుంటది , అమ్మకి అదంటే ఘోరంగా ఇష్టం . అమ్మకి ఇల్లు శుబ్రంగా ఉండటమంటే ఇష్టం . అమ్మకి నానంటే బాగా ఇష్టం . నానని చిన్న బిడ్డ లాగా చూసుకుంటది . అమ్మ నాకెప్పుడూ ... నచ్చద్ది . అమ్మ ఫ్రెండ్ వినయ అంటె అమ్మకి చాలా ఇష్టం . ఇంకా శారద అనే ఫ్రెండు కూడా ఇష్టం . అమ్మకి పొడుగ్గా వుండే జడలంటే కూడా ఇష్టం .

నాలుగు గవ్వలు

Image
నాలుగు గవ్వలు ఉండేవి . అవి ఒకటి నాన , ఒకటి అమ్మ , ఒకకొడుకూ , ఒకకూతురూ . చిన్ని గవ్వలు ఒక రోజు అన్నాయి " మేము ఒక రవంత ఆడుకోడానికి పార్కుకి వెల్లేసి వస్తాం " అని . వాళ్ళు పోతా వుంటే దారిలో ఒక చెడ్డ గవ్వ వచ్చి " జారుడు బండ , ఉయ్యాల పార్కుకి ఇటు వైపు కాదు అటు వైపు " అని చెప్పింది . కానీ అది పులి గవ్వ గుహలోకి దారి . ఆ పులిగవ్వ మామూలు గవ్వల కంటే పెద్దది . ఆ చెడ్డ గవ్వ పని ఏందంటే రోజుకి రెండు రెండు గవ్వలను పులిగవ్వకి తెచ్చీడమే . అందుకని " అయ్యో మీకు దారి తెలీదేమో నేను తీసుకెల్తా రండి " అని చెడ్డగవ్వ , చిన్న గవ్వలని పులిగవ్వ గుహ వైపుకి తీసుకెళ్తూ వుంది . అప్పుడు చిన్న గవ్వలకి అర్థమయింది ... ఇది పులిగవ్వ గుహలోకి తీసు కేల్తూ వుంది ... జారుడు బండ వైపు తీసుకెళ్లటం లేదు అని . అప్పుడు అవి మనం దీని ముందర ఏదో ఒక నాటకం వేసి వెళి పోవాల అనుకున్నాయి అప్పుడు దొంగ గవ్వతో అన్నాయి " మనం దారిలో నీడ చెట్టు చూసుకుని పడుకున్నాం , వేప చెట్టుకి నీడ బాగా వుంటుంది కా

కృష్ణుడి మంచితనాలు ..!

Image
కృష్ణుడు చిన్నప్పుడు చాలా చిలిపి వాడు . పెద్దయినాక కూడా చిలిపివాడే . మధ్యలో జరిగిందంతా చెప్పాలి కదా ! ఇప్పుడు కథ మొదలు పెడదాం . కృష్ణుడికి ఒక ఏనుగు వుండేది . దాని పేరు అపూర్వో . దాన్ని తను బాగా చూసుకునే వాడు . అది కూడా అతన్తో బాగా వుండేది . ఇద్దరూ చాలా మంచి స్నేహితులు అతని దగ్గర అలా చాలా జంతువులు ఉండేవి . ఇంకా .. అతని దగ్గ ర మూడు కుక్కలు ఉండేవి . ఒక కుక్క పేరు సరస్వతి , ఒక కుక్క పేరు లక్ష్మి . ఒక కుక్క పేరు పార్వతి . ఇంకా అతని దగ్గర ఒక గుడ్ల గూబ కూడా వుండేది . ఆ గుడ్ల గూబ పేరు కెజియ . ఇంకా అతని దగ్గర చాలా రామ చిలకలు , లవ్ బర్డ్స్ అనే పక్షులు ఉండేవి . ఇంకా నెమళ్ళు , పావురాళ్ళు కూడా ఉండేవి . అతని దగ్గర రంగు రంగు రామచిలకలు ఉండేవి . చిన్న చిన్న పిట్టలు ఉండేవి . టర్కీ కోళ్ళు కూడా ఉండేవి . ఆ టర్కీ కోళ్ల పేరు ఏందంటే ... ఒక దాని పేరు బ్లాక్ చారా , ఒక దాని పేరు సిల్వరీ . ఇంకా రెండు రామ చిలకల పేరు ఒక దాని పేరు రుక్మిణి , ఒక దాని పేరు గణేష్ . బుజ్జి పిట్టల పేరు ... బుజ్జి , కమల . అతని

ఆవు లేని ప్రపంచం ...!

Image
ఆవు లేక పోతే ఎంత కష్టమో చెప్పండీ .... మీరెప్పుడైనా ఆవు లేక పోతే బ్రతికారా ? అప్పుడు దేశంలో ఆవులు లేవు . అప్పుడు మనుషులేం చేస్తారు ? ఏమీ చేయలేరు . అల్లాగే వాళ్లు టీలు లేకుండా , పాలు లేకుండా బ్రతికే వాళ్లు . ఒక రోజు ఒక అబ్బాయికి బాలేకుండా వచ్చింది . కడుపులో వేడి చేసింది . అప్పుడు వైద్యం చేసే వాడికి కూడా ఏమీ అర్థం కాలా . అలాగే ఆ అబ్బాయి వేడి చేస్తూ చేస్తో కాసేపటికి చచ్చి పొయ్యాడు . అప్పుడు ఊరి మనుషులందరూ కలిసి పరమేశ్వరుడికి పూజ చేసారు . అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి చెప్పాడూ ... మీకందరికీ దేశం మొత్తానికీ ఒక్క ఆవునిస్తాను . కానీ మీరందరూ పదీ పదిహేను ఆవులడుగుతారు . అందుకని చెప్పి తెలిసీ నేను మీకు వెయ్యి ఆవులు ఇస్తా ఉండాను . ఒక్కో ఊరి వాళ్లు మూడు మూడు ఆవులు పంచుకోండి . రోజూ వచ్చి దాని దగ్గర పాలు పిండుకోండి ... వెళ్ళండి అని చెప్పాడు . అప్పుడు పరమేశ్వరుడు వెళ్లి పోయాక వాళ్లు రోజూ పాలు పిండుకునే వాళ్లు . ఒక మనిషి అన్నాడూ , మీరు ఏంది ఒక్క పెరుగుతోనే అంతా గడిపేసుకుంటూ వున్నారు . మీరు