అమ్మ చాలా మంచిది . అమ్మ చాలా మందికి చదువు చెప్పింది . అమ్మ బాగా చదువుకున్నది . అమ్మ చాలా పుస్తకాలు చదువుతుంది . అమ్మ నాకు చాల పుస్తకాలు కొనిచ్చింది , ఒక అల్మారా నిండుగా ... అమ్మ చాలా ధర్మవంతు రాలు . అమ్మ నాకోసం పీ హెచ్ డీ , వుద్యోగం అన్నీ వదిలేసింది . ఇప్పుడు బెంగాల్ కి వచ్చి ఉంటా వుంది . అమ్మ కుక్కల్ని , చిలకల్ని , ఆవుల్ని బాగా ప్రేమిస్తది . పైగా కప్పల్ని కూడా ప్రేమిస్తది . అనాధా శ్రమానికి కూడా డబ్బు ఇస్తది . లోకంలో అందరి మీదా రిచ్ పీపుల్ , పూర్ పీపుల్ , మిడిల్ పీపుల్ .. లోకం లో అందరి మీదా కథలు , కవితలూ రాస్తది . అమ్మ అస్సలు టీవీ చూడదు . అమ్మ చదువుకుంటా వుంటది . అమ్మ దగ్గర గాన్ విత్ ది విండ్ అని ఒక నవల వుంటది , అమ్మకి అదంటే ఘోరంగా ఇష్టం . అమ్మకి ఇల్లు శుబ్రంగా ఉండటమంటే ఇష్టం . అమ్మకి నానంటే బాగా ఇష్టం . నానని చిన్న బిడ్డ లాగా చూసుకుంటది . అమ్మ నాకెప్పుడూ ... నచ్చద్ది . అమ్మ ఫ్రెండ్ వినయ అంటె అమ్మకి చాలా ఇష్టం . ఇంకా శారద అనే ఫ్రెండు కూడా ఇష్టం . అమ్మకి పొడుగ్గా వుండే జడలంటే కూడా ఇష్టం ....
Comments
Post a Comment