కూచ్ బిహార్ !
కూచ్ బిహార్ చాలా మంచి ఊరు . కూచ్ బిహార్ లో మనుషులు కూడా మంచోళ్ళు . మేము ఇక్కడ చాలా ఆనందంగా వుండినాము . ఫస్ట్ మా నానకి ఇక్కడ ట్రైనింగ్ ఉండింది . అప్పుడు నేను చాలా చిన్న దాన్ని . తరువాత మేము ఊరికి వెలి పోయాము . తరువాత కొంచెం పెద్దయ్యాక మళ్ళీ వచ్చాము . అప్పుడు మా నాన ఎ డి ఎం అయ్యాడు . తరవాత నాకు అందరితో పరిచయం అయింది . ఒక్క మున్ని బాలతో పరిచయం అవలేదు . కొన్ని రోజులు అయినాక ఆమె గడ్డి కోస్తా ఉండింది . గడ్డి కోస్తా వుంటే నేను ఆడ నిలబడినాను . ఆమె నాతో మాట్లాడలేక పోతా ఉండింది . ఆమెను నేను ఆడుకోవడానికి పిలిచినాను . అప్పుడు ఆమె తో నాకు పరిచయమైంది . కొన్ని రోజులకి తార వచ్చింది . తరువాత లక్ష్మి . తరువాత మళ్ళీ మున్ని బాల వచ్చింది . దేవి వంట పని చేసేది . మౌసమి దేవి చక్రోబర్తి కూతురు . ఆ అమ్మాయి నాతో ఆడుకునేది . నేనూ ఆ అమ్మాయితో బాగుండే దాన్ని . మేము బానేస్వర్ కి వెళ్ళే వాళ్ళం . బానేస్వర్ లో తాబేళ్లు ఉండేవి . బానేస్వర్ చాలా బాగుండేది . బానేస్వర్ లో శివుడు ఇంకా నంది కూడా వుండే వాళ్లు . తాబేళ్ళన...