కూచ్ బిహార్ !


కూచ్ బిహార్ చాలా మంచి ఊరు.కూచ్ బిహార్ లో మనుషులు కూడా మంచోళ్ళు.మేము ఇక్కడ చాలా ఆనందంగా వుండినాము.ఫస్ట్ మా నానకి ఇక్కడ ట్రైనింగ్ ఉండింది .అప్పుడు నేను చాలా చిన్న దాన్ని .తరువాత మేము ఊరికి వెలి పోయాము.తరువాత కొంచెం పెద్దయ్యాక మళ్ళీ వచ్చాము .అప్పుడు మా నాన డి ఎం అయ్యాడు.

తరవాత నాకు అందరితో పరిచయం అయింది.ఒక్క మున్ని బాలతో పరిచయం అవలేదు.కొన్ని రోజులు అయినాక ఆమె గడ్డి కోస్తా ఉండింది.గడ్డి కోస్తా వుంటే నేను ఆడ నిలబడినాను .ఆమె నాతో మాట్లాడలేక పోతా ఉండింది.ఆమెను నేను ఆడుకోవడానికి పిలిచినాను.అప్పుడు ఆమె తో నాకు పరిచయమైంది.

కొన్ని రోజులకి తార వచ్చింది.తరువాత లక్ష్మి .తరువాత మళ్ళీ మున్ని బాల వచ్చింది.దేవి వంట పని చేసేది.మౌసమి దేవి చక్రోబర్తి కూతురు. అమ్మాయి నాతో ఆడుకునేది.నేనూ అమ్మాయితో బాగుండే దాన్ని.మేము బానేస్వర్ కి వెళ్ళే వాళ్ళం.బానేస్వర్ లో తాబేళ్లు ఉండేవి.బానేస్వర్ చాలా బాగుండేది. బానేస్వర్ లో శివుడు ఇంకా నంది కూడా వుండే వాళ్లు. తాబేళ్ళని చూసే వాళ్ళం .

నేను స్కూల్ కి కూడా వెళ్ళే దాన్ని.స్కూలు చాలా బాగుండేది.నా ఫ్రెండ్ పేరు అన్వేష . అమ్మాయి నాతో చాలా బాగుండేది.ఒక అమ్మాయి నా శత్రువు వుండేది.ఆకాంక్ష అనే అమ్మాయి ఒక కోశేన్ రాస్తా తప్పుగా నాట్ వెల్ అని రాసేస్తే పిల్ల నన్ను వెక్కిరించింది.నా షార్ప్నర్ కూడా కొట్టేసింది.అప్పుడు నేను మా అమ్మని తీసికేల్లాను.అప్పుడు అమ్మాయి అబద్దాలు చెప్పింది.

నేను షోవా దాస్ అని ఎందుకు పేరు పెట్టుకున్నానంటే నేను బెంగాలి కాబట్టి.నేను దాస్ ఎందుకంటె దాస్ లు ఉద్యోగాలు చేస్తారు . అందుకని నేను దాస్ .షోవ దాస్.

Comments

Popular posts from this blog

ది సోర్సేరర్ అండ్ ది వైట్ స్నేక్

i wanna be a good girl... all the way home (wolf children)

ఆవు లేని ప్రపంచం ...!