ది సోర్సేరర్ అండ్ ది వైట్ స్నేక్



నాకు మొన్న పరిక్షలు అయిపోయాయి.నేనొక సినిమా చూసాను.ఆ సినిమా పేరు ''ది సోర్సేరర్ అండ్ ది వైట్ స్నేక్'' .ఆ సినిమా చాలా బాగుంది.అది జపాన్ వాళ్ళ జానపద కథ .దాంట్లో వైట్ స్నేక్ పాత్ర వేసిన ఆమె పేరు ఎవా హువాంగ్ .దాంట్లో మంత్రగాడి పాత్ర వేసిన అతని పేరు జెట్ లీ .దాంట్లో గ్రాఫిక్స్ చాలా బాగుండినాయి.దాంట్లో ప్రకృతి చాలా బాగుండింది.దాంట్లో పాత్రలు చాలా బాగుండినాయి.దాంట్లో ఒక ఎలుక పాత్ర, ఒక తాబేలు పాత్ర,కుందేలు పాత్ర ,కోడి, ఇంకా రెండు పాముల పాత్ర,ఒక మంత్రగాడి పాత్ర వుంటాయి.అది చాలా మంచి సినిమా.

ఆ సినిమా కథ ఏందంటే ఫస్ట్ సీన్ రెండు పాములు దోల్లుకుని ఆడుకుంటా వుంటాయి.తరవాత ఆ తెల్ల పాము వాళ్ళ చెల్లి వెళ్లి మూలికలు ఏరుకునే వాడిని భయపెడతది.తరవాత తెల్ల పాముకి మూలికలు ఏరుకునే వాడికి పెళ్లి అవతది .ఆమె పాములాగా కాకుండా మనిషి రూపం ఎత్తుకుని పెళ్లి చేసుకుంటది.తరవాత ఒకరోజు ఆ మూలికలు ఏరుకునే వాడు ఒక మందు కనిపెట్టాలని తయారు చేస్తూ ఉంటాడు.ఆ మందు కోసం ఆమె, ఆమె శక్తినంతా ఇచ్చేస్తుంది.తరవాత మంత్రగాడు వాళ్ళిద్దర్నీ విడగోట్టేస్తాడు .ఎందుకంటె ఆమె పాము జాతిది,వాడు మనిషి జాతి .వాళ్ళిద్దరికీ పెళ్లి కాకూడదని విడగొట్టేస్తాడు .అప్పుడు తెల్ల పాము చాలా గట్టిగా ఏడస్తది .

Comments

  1. మీనాక్షి.. నువ్వు చూసిన సినిమా కథ బాగుంది కన్నా..
    ఇంకో విషయం చెప్పనా!? నీ బ్లాగ్ రోజు చూస్తూ ఉంటాను.
    నీ బ్లాగ్ చిత్రం ఎంతబాగుందో.. ! అమ్మ వెంట రెండు కూనలు యెంత హాయిగా.. స్వేచ్చగా ..బజ్జున్నాయో!
    అలాగే నీ..మాటలు (స్లాంగ్ ) చాలా స్వచ్చంగా ఉంది. నువ్వు నీలాగానే.. వ్రాయి.
    అభినందనలు..కన్నా!

    ReplyDelete
  2. థాంక్ యు అంటీ...

    ReplyDelete
  3. మీ బ్లాగ్ చాలా బాగుంది ఇంతక ముందరకన్న కూడా ఇంకా బాగుంది .....మీరు సినిమా గురించి చెప్పినది కూడా బాగుంది .........................కాని అంత మంచి సినిమా నేను చూడలేకపోయాను అని బాధగా ఉంది

    ReplyDelete
  4. నీ కోసం అంత కష్ట పడి కూర్చుని టైప్ చేస్తే నువ్వేమో కథ బాగా చెప్పలా,నువ్వు సినిమా సరిగ్గా చూడలా,లేకపోతే నీకు అర్థం కాలా .అందుకని నేను అలిగా ...అయినా సరేరా బుజ్జిలూ లవ్ యు .బాగానే రాసావులే

    ReplyDelete
  5. సామాన్య గారు మీ అమ్మాయి కోసం మీరు కష్టపడి టైపు చేసేబదులు తనకు తెలుగు టైపింగ్ నేర్పండి. తన ఆలోచనలకు అంతరాయం లేకుండా రాయగలుగుతుంది. అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ తో మీ పాపాయి అతిసులభంగా 24 గంటలలోనే తెలుగు టైపింగ్ నేర్చుకోగలుగుతుంది.

    అనుపమ తెలుగు టైపింగ్ ట్యూటర్ 2008 లో విడుదలైన తొలి తెలుగు టైపింగ్ ట్యూటర్. దీని గురించి వీవెన్ గారి రివ్యూ కింద చూడవచ్చు.
    http://veeven.wordpress.com/2008/04/27/intro-to-anupama-typing-tutor/

    అనుపమ వెబ్ సైటు కింద చూడవచ్చు.
    www.anupamatyping.com

    తెలుగు టైపింగ్ గురించి, తెలుగు ఫాంటుల గురించి కింది బ్లాగులో చూడవచ్చు.
    www.anupamatelugu.blogspot.com

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

i wanna be a good girl... all the way home (wolf children)

ఆవు లేని ప్రపంచం ...!