Posts

Showing posts from August, 2012

షీలా పావడ !

Image
షీలా పావడ చాలా చినిగి పోయి వుంటది .దానికి  ఆమె పది సార్లు కుట్లు వేసింది .దానిని చూసి నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటె ఆమె దాన్ని అన్ని సార్లు కుట్టుకున్నది .ఆమెకసలు పావడలే లేవు.షీలా భర్త రిష్కా [షీలా అలాగే అంటుంది  ] తోక్కుతాడు. ఆయన చేతులు రిక్షా తొక్కి తొక్కి వంగి పోయాయి .ఆయన మన లాగా అన్నం తిన లేడు .షీలా వచ్చి ఒక బంగ్లా దేశీ . షీలా ఇల్లు రోవంత పగిలిపోయి వుంటది,రోవంత బాగుంటది .నిన్న మా అమ్మ ఒక పుస్తకం చదివింది .ఆ పుస్తకం పేరు ''అగ్నిసాక్షి'' రచయిత్రి పేరు ''లలితాంబిక అంతర్జనం'' .ఆమె అందరు పడుకున్న తరువాత ఒక దీపం బుడ్డి వెలిగించుకుని రాసేది .ఆ దీపం బుడ్డి పొగకి కళ్ళు మండిపోయినప్పుడు ఆమె కళ్ళు మూసుకుని రాసేది .ఆమె నంబూద్రి బ్రాహ్మణుల గురించి రాసింది .వాళ్ళ  నియమం ఏందంటే వాళ్ళ ఆడవాళ్ళు మాత్రం బయటికేల్లెటప్పుడు వొళ్ళంతా బట్ట కప్పుకుని  భుజాలు దాటి వుండే గొడుగు వేసుకుని వెళ్ళాల్సి వచ్చేది .పేద ఆడవాళ్ళు మాత్రం వక్షోజాలు [సంస్కృతంలో ఇలా అంటారని మా పెద్దఅమ్మమ్మ చెప్పింది ] బయటకి యేసేసి అందరు  మగవాళ్ళ ముందర తిరగాల్సి వచ్చేది. నేను దాని గురించి చాలా బా...