షీలా పావడ !

షీలా పావడ చాలా చినిగి పోయి వుంటది .దానికి  ఆమె పది సార్లు కుట్లు వేసింది .దానిని చూసి నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటె ఆమె దాన్ని అన్ని సార్లు కుట్టుకున్నది .ఆమెకసలు పావడలే లేవు.షీలా భర్త రిష్కా [షీలా అలాగే అంటుంది  ] తోక్కుతాడు. ఆయన చేతులు రిక్షా తొక్కి తొక్కి వంగి పోయాయి .ఆయన మన లాగా అన్నం తిన లేడు .షీలా వచ్చి ఒక బంగ్లా దేశీ . షీలా ఇల్లు రోవంత పగిలిపోయి వుంటది,రోవంత బాగుంటది .నిన్న మా అమ్మ ఒక పుస్తకం చదివింది .ఆ పుస్తకం పేరు ''అగ్నిసాక్షి'' రచయిత్రి పేరు ''లలితాంబిక అంతర్జనం'' .ఆమె అందరు పడుకున్న తరువాత ఒక దీపం బుడ్డి వెలిగించుకుని రాసేది .ఆ దీపం బుడ్డి పొగకి కళ్ళు మండిపోయినప్పుడు ఆమె కళ్ళు మూసుకుని రాసేది .ఆమె నంబూద్రి బ్రాహ్మణుల గురించి రాసింది .వాళ్ళ  నియమం ఏందంటే వాళ్ళ ఆడవాళ్ళు మాత్రం బయటికేల్లెటప్పుడు వొళ్ళంతా బట్ట కప్పుకుని  భుజాలు దాటి వుండే గొడుగు వేసుకుని వెళ్ళాల్సి వచ్చేది .పేద ఆడవాళ్ళు మాత్రం వక్షోజాలు [సంస్కృతంలో ఇలా అంటారని మా పెద్దఅమ్మమ్మ చెప్పింది ] బయటకి యేసేసి అందరు  మగవాళ్ళ ముందర తిరగాల్సి వచ్చేది. నేను దాని గురించి చాలా బాధ పడ్డా .ప్రపంచంలో ఎందుకు ఈ సాంప్రదాయాలు వుంటాయి?మనము  ఈ సంప్రదాయాలని ఖండించాల!కోటీశ్వరులు కప్పుకుని తిరగడం, పేదవాళ్ళు విప్పుకుని తిరగడం ఏం బాగాలేదు.అందుకని నాకు బాధేసింది.ప్రపంచం చాలా బాగుండాలి .ఈ సాంప్రదాయాలు వుండకూడదు.

Comments

  1. బుజ్జిలూ నువ్వు రాసింది బాగానే ఉంది కానీ, ఏంటంటే షీలా గురించి స్టార్ట్ చేసి అగ్ని సాక్షి కి ఎందుకు వెళ్ళినట్లు?పూర్తిగా లింక్ తెగి పోయిందని కాదు బంగారులూ కానీ ...సరేలే ...నీకేది తోస్తే అదే కదా .అయినా షీలా విషయం మధ్యలో వదిలేసావని కొంచెం బాధగా ఉంది బుజ్జూ ...

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ది సోర్సేరర్ అండ్ ది వైట్ స్నేక్

i wanna be a good girl... all the way home (wolf children)

ఆవు లేని ప్రపంచం ...!