ది సోర్సేరర్ అండ్ ది వైట్ స్నేక్
నాకు మొన్న పరిక్షలు అయిపోయాయి.నేనొక సినిమా చూసాను.ఆ సినిమా పేరు ''ది సోర్సేరర్ అండ్ ది వైట్ స్నేక్'' .ఆ సినిమా చాలా బాగుంది.అది జపాన్ వాళ్ళ జానపద కథ .దాంట్లో వైట్ స్నేక్ పాత్ర వేసిన ఆమె పేరు ఎవా హువాంగ్ .దాంట్లో మంత్రగాడి పాత్ర వేసిన అతని పేరు జెట్ లీ .దాంట్లో గ్రాఫిక్స్ చాలా బాగుండినాయి.దాంట్లో ప్రకృతి చాలా బాగుండింది.దాంట్లో పాత్రలు చాలా బాగుండినాయి.దాంట్లో ఒక ఎలుక పాత్ర, ఒక తాబేలు పాత్ర,కుందేలు పాత్ర ,కోడి, ఇంకా రెండు పాముల పాత్ర,ఒక మంత్రగాడి పాత్ర వుంటాయి.అది చాలా మంచి సినిమా. ఆ సినిమా కథ ఏందంటే ఫస్ట్ సీన్ రెండు పాములు దోల్లుకుని ఆడుకుంటా వుంటాయి.తరవాత ఆ తెల్ల పాము వాళ్ళ చెల్లి వెళ్లి మూలికలు ఏరుకునే వాడిని భయపెడతది.తరవాత తెల్ల పాముకి మూలికలు ఏరుకునే వాడికి పెళ్లి అవతది .ఆమె పాములాగా కాకుండా మనిషి రూపం ఎత్తుకుని పెళ్లి చేసుకుంటది.తరవాత ఒకరోజు ఆ మూలికలు ఏరుకునే వాడు ఒక మందు కనిపెట్టాలని తయారు చేస్తూ ఉంటాడు.ఆ మందు కోసం ఆమె, ఆమె శక్తినంతా ఇచ్చేస్తుంది.తరవాత మంత్రగాడు వాళ్ళిద్దర్నీ విడగోట్టేస్తాడు .ఎందుకంటె ఆమె పాము జాతిది,వాడు మనిషి జాతి .వాళ్ళిద్దరికీ పెళ్లి కా...