Posts

Showing posts with the label ఆలోచనలు

షీలా పావడ !

Image
షీలా పావడ చాలా చినిగి పోయి వుంటది .దానికి  ఆమె పది సార్లు కుట్లు వేసింది .దానిని చూసి నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటె ఆమె దాన్ని అన్ని సార్లు కుట్టుకున్నది .ఆమెకసలు పావడలే లేవు.షీలా భర్త రిష్కా [షీలా అలాగే అంటుంది  ] తోక్కుతాడు. ఆయన చేతులు రిక్షా తొక్కి తొక్కి వంగి పోయాయి .ఆయన మన లాగా అన్నం తిన లేడు .షీలా వచ్చి ఒక బంగ్లా దేశీ . షీలా ఇల్లు రోవంత పగిలిపోయి వుంటది,రోవంత బాగుంటది .నిన్న మా అమ్మ ఒక పుస్తకం చదివింది .ఆ పుస్తకం పేరు ''అగ్నిసాక్షి'' రచయిత్రి పేరు ''లలితాంబిక అంతర్జనం'' .ఆమె అందరు పడుకున్న తరువాత ఒక దీపం బుడ్డి వెలిగించుకుని రాసేది .ఆ దీపం బుడ్డి పొగకి కళ్ళు మండిపోయినప్పుడు ఆమె కళ్ళు మూసుకుని రాసేది .ఆమె నంబూద్రి బ్రాహ్మణుల గురించి రాసింది .వాళ్ళ  నియమం ఏందంటే వాళ్ళ ఆడవాళ్ళు మాత్రం బయటికేల్లెటప్పుడు వొళ్ళంతా బట్ట కప్పుకుని  భుజాలు దాటి వుండే గొడుగు వేసుకుని వెళ్ళాల్సి వచ్చేది .పేద ఆడవాళ్ళు మాత్రం వక్షోజాలు [సంస్కృతంలో ఇలా అంటారని మా పెద్దఅమ్మమ్మ చెప్పింది ] బయటకి యేసేసి అందరు  మగవాళ్ళ ముందర తిరగాల్సి వచ్చేది. నేను దాని గురించి చాలా బా...

పాత నందు !

నేను నందు ని చూసినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది .మా అమ్మ కూడా చాలా ఆనంద పడింది .రోజూ మా నాన్న దాన్ని భుజం పైన మోసేవాడు .అసలు అదెవరో మీకు తెలీదు అది ఒక రామ చిలుక .అయితే మా నాన్నకి తమ్లుక్ కి ట్రాన్స్ఫర్ అయింది .కానీ నందు అక్కడ లేదు నేను ఘోరంగా ఆశ్చర్య పడ్డా.బ్రిహస్పతి దానికి రెక్కలు కత్తిరించ లేదు .అది హటాత్ గా ఎగిరెలిపోయింది .అప్పుడు అమ్మ చాలా బాధ పడింది .అయితే అప్పుడు నాన్న రాధిక నందు అనే రెండు రామ చిలుకల్ని తెచ్చిచ్చాడు .అమ్మకి అప్పటికి కూడా దుక్ఖం కుదర లేదు. అయితే అది రోజు రోజుకి దగ్గర అవతా అవతా అమ్మ వళ్ళోకి వచ్చేసేది .తరువాత నాన్నకి కోచ్ బీహార్ కి ట్రాన్స్ఫర్ అయింది .మాకు కోచ్ బిహార్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మా కొత్త నందు ను మేం వదిలేసాం .ఎందుకంటె దానికి రెక్కలోచ్చాయి ,దానికి మనసులో బాధేస్తుంది ఎగరాలని .అయితే రెండు వారాలకి రాధిక కు కూడా రెక్కలోచ్చేసినాయ్.సరే అని రాదికాని కూడా వదిలేసాం .ఇంకట్లో కథ ఆపేసా ఇదే మాకు జరిగిన కథ .నేను కథ ఆపేటప్పుడు ఒక మాట చెప్తా ఉండా.ఆ మాట ఏందంటే మీరు ఎప్పుడైనా చిలకల్ని పెంచుకునేటప్పుడు చిన్న బిడ్డ రామ చిలకల్ని తెచ్చుకుని చిన్నప్పట్నుండి పెంచుకోండి రెక్కల...