Posts

Showing posts with the label కూచ్ బిహార్

కూచ్ బిహార్ !

Image
కూచ్ బిహార్ చాలా మంచి ఊరు . కూచ్ బిహార్ లో మనుషులు కూడా మంచోళ్ళు . మేము ఇక్కడ చాలా ఆనందంగా వుండినాము . ఫస్ట్ మా నానకి ఇక్కడ ట్రైనింగ్ ఉండింది . అప్పుడు నేను చాలా చిన్న దాన్ని . తరువాత మేము ఊరికి వెలి పోయాము . తరువాత కొంచెం పెద్దయ్యాక మళ్ళీ వచ్చాము . అప్పుడు మా నాన ఎ డి ఎం అయ్యాడు . తరవాత నాకు అందరితో పరిచయం అయింది . ఒక్క మున్ని బాలతో పరిచయం అవలేదు . కొన్ని రోజులు అయినాక ఆమె గడ్డి కోస్తా ఉండింది . గడ్డి కోస్తా వుంటే నేను ఆడ నిలబడినాను . ఆమె నాతో మాట్లాడలేక పోతా ఉండింది . ఆమెను నేను ఆడుకోవడానికి పిలిచినాను . అప్పుడు ఆమె తో నాకు పరిచయమైంది . కొన్ని రోజులకి తార వచ్చింది . తరువాత లక్ష్మి . తరువాత మళ్ళీ మున్ని బాల వచ్చింది . దేవి వంట పని చేసేది . మౌసమి దేవి చక్రోబర్తి కూతురు . ఆ అమ్మాయి నాతో ఆడుకునేది . నేనూ ఆ అమ్మాయితో బాగుండే దాన్ని . మేము బానేస్వర్ కి వెళ్ళే వాళ్ళం . బానేస్వర్ లో తాబేళ్లు ఉండేవి . బానేస్వర్ చాలా బాగుండేది . బానేస్వర్ లో శివుడు ఇంకా నంది కూడా వుండే వాళ్లు . తాబేళ్ళన...

మున్ని బాల కష్టాలు !

Image
ఈమె పేరు మున్ని బాల.ఈమెకి చాలా కష్టాలు.ఈమెకి పగలోస్తే సాయంత్రం దాకా తిండి ఉండదు.ఈమె చాలా మంచిది.ఈమె గడ్డి కోస్తది.ఈమెకొక కొడుకు ఉన్నాడు .ఈమెకి చిన్నప్పుడే అమ్మ నాన్న చని పోయారు.కొడుకు పొట్టలో ఉండగా ఆమె భర్త చని పోయాడు.ఆమె భర్త బిల్డింగ్ పై నుండి పడి చనిపోయాడు. ఆమెకి ఒక ఫోటో ఉంది.మున్ మున్ సేన్ తో .మున్ని బాలని మున్ మున్ సేన్ వాళ్లు పనికి రమ్మన్నారు.అంటే ఆమె అన్నదీ నా బిడ్డని తీసుకు రావచ్చా ....అని.అంటే వాళ్లు అన్నారు..కాదు!అంటే ఆమె అప్పుడు గమ్మున ఉండి పోయింది.ఆమె యింక రాను అన్నది .తరవాత ఆమె మా ఇంటికి పనికి వచ్చింది .ఆమె నాతో చాలా బాగుంటది.నిజమైతే ఆమె పిలకాయలని చాలా బాగా చూస్తది. ఆమె కృష్ణుడి పూజలు చేస్తది.అసలు ఆమె పాటలు కూడా పాడద్ది.

హేమ వాళ్ళ అమ్మ గురించి !

Image
హేమ వాళ్ళ అమ్మ చాలా నెమ్మదిగా ఉండేది .హేమ కూడా చాలా నెమ్మదిగా ఉండేది .హేమ కి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం .వాళ్ళ అమ్మ చాలా నెమ్మదీగా ఉండేది ఇంకా మాకు ఐదు లీటర్ల పాలు ఇచ్చేది .మేము  చాలా హాయిగా ఉండేవాళ్ళం .హేమ రోజు వాళ్ళ అమ్మ పాలు తాగేది .ఒక రోజు హేమ వాళ్ళ అమ్మ పాలీడం మానేసింది .హేమాకి మాత్రం పాలిచ్చేది .అది ఎందుకయ్యిందంటే హేమా వాళ్ళ అమ్మకి గడ్డి తినడానికి లేదు . రోజూ పక్క బంగ్లాకి వేల్లాల్సోచ్చేది .తరవాత కొన్ని రోజులకి హేమ వాళ్ళ అమ్మని పంపేసారు కానీ హేమా మాత్రం ఉంది .హేమాకి చాలా దుఖం వేసింది .తరవాత కొన్ని రోజులకి కొత్త ఆవు వచ్చింది .దాన్ని చూసి హేమ ,వాళ్ళ అమ్మ అనుకుంది .ఆ కొత్త ఆవు హేమ వాళ్ళ అమ్మ లాగా చాలా నెమ్మది కాదు .తరువాత కొన్ని రోజులు రాజ మల్లికకి కోపం వచ్చి ఆ కొత్త ఆవు దగ్గరకి పోతూ ఉంది అప్పుడు నేను లక్కి ఆ కొత్త ఆవు దూడ దగ్గర ఉన్నాం .అప్పుడు ఆ ఆవు తాడు తెగి పోయింది .అయితే సుదాన్క్షు ఎంత చెప్పినా రాజాలు వినట్లేదు .అప్పుడు లక్కి నన్ను అట్ట లాగింది ఎందుకని చూస్తే ఆ ఆవు తాడు తెగిపోయింది .అప్పుడు నా కాళ్ళు వనకతా ఉండాయి .తరవాత అమ్మ వచ్చి రాజ మల్లికని లాగింది. తరవాత నా హేమా కోస...

మహా విష్ణువు !

Image
ఆ పచ్చని గడ్డి లో నీలమైన కృష్ణుడు చెట్టు మీద .. పక్కనే యమునా నది ,చెట్టు మీద కృష్ణుడు కూర్చుని ఉన్నాడు ఆ నీలమైన రంగు,ఆ నీలమైన చేతులు ,ఆ నీలమైన ముక్కు ,ఆ నీలమైన కాళ్ళు ,ఆ నీలమైన మొహం యమునా నది వెనకాల పచ్చని చెట్లు కృష్ణ నీ ఆవులేవి అని అడిగినారు వాళ్లు చెట్టు మీద అందమైన కోయిలల పాట మల్లి కృష్ణుడు సంతోషంగా వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చాడు .

రాస్ మేళా

Image
ఇది మేము చూసేది . ఇది మేము చూసే మంచి విషయం కాని మేము' డి ఎం' అయిన తరువాత నేను రాస్ మేళ ఉండాల్సిందే అంటా . ప్రజలు సంతోషిస్తారని నేను కోరుకొంటున్నాను. ఇవన్ని మా ఊర్లో ఉండవు ఈ కుర్చీలు,బొమ్మలు, రంగుల రాట్నాలు ,బంగ్లాదేశ్ చీరలు మా ఊర్లో ఉండవు కానీ ప్రజల సంతోషం కోసమే నమస్కారం

రాస్ మేళా

అవ్వ -రాజ బాడి దగ్గర

Image
అవ్వ నన్ను బాగా చూసుకున్నది .అవ్వని నేను కూడా బాగా చూసుకున్నా.మేమిద్దరం బాగానే ఉండేము .అవ్వ స్నానం చేస్తానంటే నేనేమనే దాన్నంటే నేనొచ్చిన తరువాత స్నానం చెయ్యమనేదాన్ని.అవ్వ నేను చాలా వరకు దూడతో ఆడుకున్నాం.అవ్వ ఏమనేదంటే కలిసి స్నానం చెయ్యడం నాకు సిగ్గు అనేది .అవ్వ నాకు అ ,ఆ లు చదివించింది .అవ్వ ఊరుకూరికే సంతోష్ పేరు మరిచి పోయేది అప్పుడు నన్నదిగేది వాడి పేరు ఏమని .రాజ్ భవన్

hema

Image
చెరువులో నీళ్ళు తాగుదామంటే కాకి తాగిన ఎంగిలి ఓ రమణ .ఇంట్లో అన్నం తిందామంటే కట్టెలు తక్కువ ఓ రమణ . బైటికి పొయ్యి కాస్త కట్టెలు తెద్దామంటే భయం ఓ రమణ . ఇంట్లోకి పొయ్యి కాసేపు పడుకొందామంటే అమ్మ కొడుతుందని బయం ఓ రమణ

animal kids

tiger---cub  woman----baby sheep----lamb goat---kid cat----kitten dog---puppy  cow-----calf .