నాలుగు గవ్వలు
నాలుగు గవ్వలు ఉండేవి . అవి ఒకటి నాన , ఒకటి అమ్మ , ఒకకొడుకూ , ఒకకూతురూ . చిన్ని గవ్వలు ఒక రోజు అన్నాయి " మేము ఒక రవంత ఆడుకోడానికి పార్కుకి వెల్లేసి వస్తాం " అని . వాళ్ళు పోతా వుంటే దారిలో ఒక చెడ్డ గవ్వ వచ్చి " జారుడు బండ , ఉయ్యాల పార్కుకి ఇటు వైపు కాదు అటు వైపు " అని చెప్పింది . కానీ అది పులి గవ్వ గుహలోకి దారి . ఆ పులిగవ్వ మామూలు గవ్వల కంటే పెద్దది . ఆ చెడ్డ గవ్వ పని ఏందంటే రోజుకి రెండు రెండు గవ్వలను పులిగవ్వకి తెచ్చీడమే . అందుకని " అయ్యో మీకు దారి తెలీదేమో నేను తీసుకెల్తా రండి " అని చెడ్డగవ్వ , చిన్న గవ్వలని పులిగవ్వ గుహ వైపుకి తీసుకెళ్తూ వుంది . అప్పుడు చిన్న గవ్వలకి అర్థమయింది ... ఇది పులిగవ్వ గుహలోకి తీసు కేల్తూ వుంది ... జారుడు బండ వైపు తీసుకెళ్లటం లేదు అని . అప్పుడు అవి మనం దీని ముందర ఏదో ఒక నాటకం వేసి వెళి పోవాల అనుకున్నాయి అప్పుడు దొంగ గవ్వతో అన్నాయి " మనం దారిలో నీడ చెట్టు చూసుకుని పడుకున్నాం , వేప చెట్టుకి నీడ బాగా వుంటుంది కా...