నాలుగు గవ్వలు


నాలుగు గవ్వలు ఉండేవి .అవి ఒకటి నాన,ఒకటి అమ్మ ,ఒకకొడుకూ,ఒకకూతురూ.
చిన్ని గవ్వలు ఒక రోజు అన్నాయి "మేము ఒక రవంత ఆడుకోడానికి పార్కుకి వెల్లేసి వస్తాం"అని.
వాళ్ళు
పోతా వుంటే దారిలో ఒక చెడ్డ గవ్వ వచ్చి "జారుడు బండ ,ఉయ్యాల పార్కుకి ఇటు వైపు కాదు అటు వైపు "అని చెప్పింది.

కానీ
అది పులి గవ్వ గుహలోకి దారి . పులిగవ్వ మామూలు గవ్వల కంటే పెద్దది . చెడ్డ గవ్వ పని ఏందంటే రోజుకి రెండు రెండు గవ్వలను పులిగవ్వకి తెచ్చీడమే .అందుకని "అయ్యో మీకు దారి తెలీదేమో నేను తీసుకెల్తా రండి"అని చెడ్డగవ్వ, చిన్న గవ్వలని పులిగవ్వ గుహ వైపుకి తీసుకెళ్తూ వుంది .

అప్పుడు
చిన్న గవ్వలకి అర్థమయింది...ఇది పులిగవ్వ గుహలోకి తీసు కేల్తూ వుంది... జారుడు బండ వైపు తీసుకెళ్లటం లేదు అని .అప్పుడు అవి మనం దీని ముందర ఏదో ఒక నాటకం వేసి వెళిపోవాల అనుకున్నాయి

అప్పుడు
దొంగ గవ్వతో అన్నాయి" మనం దారిలో నీడ చెట్టు చూసుకుని పడుకున్నాం,వేప చెట్టుకి నీడ బాగా వుంటుంది కాబట్టి వేపచెట్టు కింద పడుకున్నాం"అని .అప్పుడు చెడ్డ గవ్వ నిదర పోయిన తర్వాత అన్న చెల్లెలు కలిసి ఇంటికి వెళ్లి పోయారు .

అప్పుడు వాళ్ళ అమ్మా నాన్నతో చెప్పారు"అమ్మా!మమ్మల్ని ఒక చెడ్డ గవ్వ ,పులిగవ్వ దగ్గరికి తీసికెళ్ళ బోయింది "అని అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది " అందుకే నేను చెప్పింది బయట వాళ్ళతో మాట్లాడవద్దు ''అని.

కథకి అర్థం ఏందంటే ''పెద్ద వారి మాట సద్దన్నం మూట"

Comments

  1. బుజ్జిలూ
    పిల్లల్ని పటికెల్లి పోయే కథలు బోలెడు విన్నాను ,పంచతంత్రం కథలని విన్నాను వాటిలి నిండా జంతువులుంటాయిలే మనుషుల బుద్దులతో ...కానీ బంగారుకొండోయ్ గవ్వలతో కథ మాత్రం నువ్వే చెప్పడం, నేనిదే మొదటి సారి వినడం...
    లవ్ యు బుజ్జిలూ

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ది సోర్సేరర్ అండ్ ది వైట్ స్నేక్

i wanna be a good girl... all the way home (wolf children)

తెలుగు నవ్వులు