ఆవు లేని ప్రపంచం ...!


ఆవు లేక పోతే ఎంత కష్టమో చెప్పండీ....
మీరెప్పుడైనా ఆవు లేక పోతే బ్రతికారా?

అప్పుడు దేశంలో ఆవులు లేవు.అప్పుడు మనుషులేం చేస్తారు?ఏమీ చేయలేరు.అల్లాగే వాళ్లు టీలు లేకుండా ,పాలు లేకుండా బ్రతికే వాళ్లు .ఒక రోజు ఒక అబ్బాయికి బాలేకుండా వచ్చింది.కడుపులో వేడి చేసింది .అప్పుడు వైద్యం చేసే వాడికి కూడా ఏమీ అర్థం కాలా.అలాగే అబ్బాయి వేడి చేస్తూ చేస్తో కాసేపటికి చచ్చి పొయ్యాడు.అప్పుడు ఊరి మనుషులందరూ కలిసి పరమేశ్వరుడికి పూజ చేసారు.

అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యి చెప్పాడూ... మీకందరికీ దేశం మొత్తానికీ ఒక్క ఆవునిస్తాను .కానీ మీరందరూ పదీ పదిహేను ఆవులడుగుతారు .అందుకని చెప్పి తెలిసీ నేను మీకు వెయ్యి ఆవులు ఇస్తా ఉండాను.ఒక్కో ఊరి వాళ్లు మూడు మూడు ఆవులు పంచుకోండి .రోజూ వచ్చి దాని దగ్గర పాలు పిండుకోండి ... వెళ్ళండి అని చెప్పాడు .

అప్పుడు పరమేశ్వరుడు వెళ్లి పోయాక వాళ్లు రోజూ పాలు పిండుకునే వాళ్లు .

ఒక మనిషి అన్నాడూ ,మీరు ఏంది ఒక్క పెరుగుతోనే అంతా గడిపేసుకుంటూ వున్నారు .మీరు ఎందుకు ఎప్పుడూ చాయిలూ ,వెన్న ఇవంతా తయారు చెయ్యకుండా వున్నారు?మేం మా ఇంట్లో సరదాగా చాయిలూ అవన్నీ పెట్టుకుని సరదాగా గడిపేస్తున్నాం.

వీళ్ళు ఇదేందో బాగుందే అనుకుని చాయిలు అవన్నీ పెటుకోడం మొదలు పెట్టారు.

అలాగే వూరిలో యశోద అనే ఒకామె వుండేది.ఆమెకి ఒక కొడుకు పుట్టాడు .అతని పేరు కృష్ణ .కృష్ణ పెరుగుతూ పెరుగుతూ పెద్దయ్యాడు.పెద్దయ్యి చిందులేస్తూ ,గెంతుతూ ...బాగా ఆడుకునే వాడు .ఒక్కొక్క సారి అందరింట్లో వెన్న కూడా దొంగలించే వాడు వాడు .ఆవు కూడా వాడిని బాగా చూసుకునేది.

అప్పుడొక రోజు వాడు పొద్దునే ఆవు దగ్గరికి వెళ్ళాడు .ఆ ఆవు మాట్లాడకుండా ఏడుస్తూ ఉండింది.అప్పుడు యశోద అన్నదీ దానికికడుపు వచ్చింది అని .దానికి ఒక చిన్న బిడ్డ పుట్టింది .ఆ బిడ్డ పేరు గంగ .
ఆ ఆవు ముసలిదై పోయింది.పాలీడం మానేసింది .అప్పుడు గంగ పెద్దదై పాలీడం మొదలెట్టింది .అది పాలిస్తూ వుంటే అప్పుడు అందరూ సంతోషం గా వుండినారు.

Comments

  1. అసలకి డాలింగ్ ఎంత బాగా రాసేవో తెల్సా ...ఆవు లేక పోతే ఎట్టబ్బా ... పొద్దున్నే నాకు కాఫీ ఎట్టబ్బా... అని మస్తు దిగులు పుట్టిందనుకో,మీ పరమేశ్వరుడికి థాంక్స్ చెప్పాలబ్బా ! ఒక సారి ఆయన్ని ఇట్ట పంపించవా బుజ్జిలూ ...!

    ReplyDelete
  2. పరమేశ్వర పరమేశ్వర నాకు పాలు వద్దు పాలిచ్చే ఆవు వద్దు గాని ఈ కథ రాసిన అమ్మలు కుట్టిని రొజూ నాకు అడిగినప్పుడల్లా ఆబ్బ పెట్టే లాగ వరమివ్వు తండ్రీ........................

    ReplyDelete
  3. wow! excellent chinnilu..ilaa nuvvu chaalaa kathalu baagaa wraastoo undaalantaa...intakee nuvvu ye class?

    ReplyDelete
  4. ennela gaaru ...thank you.your blog is very excellent and beautiful .try to write more .
    i am studying class 2 in christ academy,siliguri,west bengal.
    come to our house.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ది సోర్సేరర్ అండ్ ది వైట్ స్నేక్

i wanna be a good girl... all the way home (wolf children)

తెలుగు నవ్వులు