కృష్ణుడి మంచితనాలు ..!
కృష్ణుడు చిన్నప్పుడు చాలా చిలిపి వాడు.పెద్దయినాక కూడా చిలిపివాడే .మధ్యలో జరిగిందంతా చెప్పాలి కదా!ఇప్పుడు కథ మొదలు పెడదాం.
కృష్ణుడికి ఒక ఏనుగు వుండేది .దాని పేరు అపూర్వో.దాన్ని తను బాగా చూసుకునే వాడు.అది కూడా అతన్తో బాగా వుండేది.ఇద్దరూ చాలా మంచి స్నేహితులు అతని దగ్గర అలా చాలా జంతువులు ఉండేవి.ఇంకా ..అతని దగ్గర మూడు కుక్కలు ఉండేవి.ఒక కుక్క పేరు సరస్వతి,ఒక కుక్క పేరు లక్ష్మి.ఒక కుక్క పేరు పార్వతి.ఇంకా అతని దగ్గర ఒక గుడ్ల గూబ కూడా వుండేది.ఆ గుడ్ల గూబ పేరు కెజియ.
ఇంకా అతని దగ్గర చాలా రామ చిలకలు ,లవ్ బర్డ్స్ అనే పక్షులు ఉండేవి .ఇంకా నెమళ్ళు,పావురాళ్ళు కూడా ఉండేవి.అతని దగ్గర రంగు రంగు రామచిలకలు ఉండేవి.చిన్న చిన్న పిట్టలు ఉండేవి.టర్కీ కోళ్ళు కూడా ఉండేవి.
ఆ టర్కీ కోళ్ల పేరు ఏందంటే ...ఒక దాని పేరు బ్లాక్ చారా ,ఒక దాని పేరు సిల్వరీ.ఇంకా రెండు రామ చిలకల పేరు ఒక దాని పేరు రుక్మిణి,ఒక దాని పేరు గణేష్.బుజ్జి పిట్టల పేరు ...బుజ్జి,కమల.
అతని దగ్గర ఏందో లేదని ఆలోచిస్తూ వుండే వాడు.అలా ఆలోచిస్తూ ...ఆలోచిస్తూ వుంటే ఒక రోజు అతని దగ్గర రాజ హంసలు లేవని అతనికి ఆలోచన అయ్యింది .అప్పుడు వాళ్ళమ్మతో పొయ్యి అన్నాడు...అమ్మా నాకు రాజ హంసలు కావాలి అని.ఇంకా మొసళ్ళు కూడా కావాలన్నాడు,ఇంకా కప్పలు ,తాబేలు కూడా కావాలన్నాడు.
అప్పుడు సరే నువ్వు ఆ మాటే తీసికెళ్ళి నాన్నకి చెప్పు కొనిస్తాడు అన్నది.అప్పుడు వాళ్ళ నాన్నకి చెప్తే వాళ్ళ నాన్న ఆ జంతువులన్నీ తెచ్చిచ్చాడు.అయితే అంతకు ముందు కృష్ణుడు అసలు బయటికే వెళ్ళే వాడు కాదు.అయితే ఇప్పుడంతా బయటికే తిరుగుతూ వున్నాడు.పక్షులతో అన్నిటితో ఆడుకునే వాడు.
అతను ఒక రోజు బయటికి వెళ్తే అతనికి రెండు ఉడతలు దొరికినాయ్.అప్పుడు ఆ ఉడతలు అన్నాయీ..ఈ అడివికి వేటగాళ్ళు వచ్చినారు.మా అందరు జంతువులనీ తీసికెళ్ళి అమ్మేస్తా వుండాడు.నువ్వు మాకు ఏదైనా సహాయం చేస్తావా?.
అప్పుడు కృష్ణుడు అన్నాడు...ఆ వేటగాళ్ళు అందరూ వెళ్లి పోయే దాకా మీరందరూ మా దగ్గరే వుండండి.అప్పుడు కొన్ని జంతువులని ఇంట్లో పెట్టుకుని ,కొన్ని జంతువులని డేరా కట్టిచ్చి, కింద చాపలు ,చాపల పైన దుప్పట్లు పరచి, కప్పల కోసం నీళ్ళు ఇంకా తమలపాకులు [అంటే తామరాకులని అర్థం:)] కట్టించారు.వాట్లి కోసం ఇంకా కప్పుకోడానికి దుప్పట్లు కూడా యిచ్చారు.
లోపల పడుకున్న జంతువులకి కొన్ని నులక మంచాలు వేయించి వాట్లి పైన రెండు మూడు బొంతలు పరచి, ఒక బొంత కప్పుకోడానికి యిచ్చారు.కొన్ని జంతువులు కప్పుకోడానికి శాలువాలు అడిగితే శాలువాలు యిచ్చారు.రగ్గులడిగితే రగ్గులు యిచ్చారు.
అప్పుడు అన్ని జంతువులు సంతోషంగా వున్నాయి.వేటగాళ్ళు కూడా కొన్ని రోజులు చూసి వెళ్లి పోయారు.అప్పుడు అన్ని జంతువులు అన్నాయి ''ఇంక మేం వెళ్లి పోతాం''.అప్పుడు కృష్ణుడి వాళ్ళ అమ్మా నాన్న ...మీరిక్కడే ఉండి పోండి అన్నారు.అప్పుడు నాయకుడి మాట కాదనలేక అవి తలూపేసాయ్.అప్పుడు అవి అక్కడే ఉండి పోయాయ్.

అసలకి బుజ్జిలూ... కృష్ణుడు గురించి చిన్నప్పటికీ పెద్దప్పటికీ మధ్యలో ని ఈ విషయాలు నాకు తెలీనే తెలీదనుకో .భలే కథ చెప్పావులే థాంక్ యు కొండా .ఇంకా ''సేవ చెయ్యాల'' అని కథ అర్థం చెప్పావు కదా అదిరిందనుకో బంగారూ ...
ReplyDelete