పాత నందు !
నేను నందు ని చూసినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది .మా అమ్మ కూడా చాలా ఆనంద పడింది .రోజూ మా నాన్న దాన్ని భుజం పైన మోసేవాడు .అసలు అదెవరో మీకు తెలీదు అది ఒక రామ చిలుక .అయితే మా నాన్నకి తమ్లుక్ కి ట్రాన్స్ఫర్ అయింది .కానీ నందు అక్కడ లేదు నేను ఘోరంగా ఆశ్చర్య పడ్డా.బ్రిహస్పతి దానికి రెక్కలు కత్తిరించ లేదు .అది హటాత్ గా ఎగిరెలిపోయింది .అప్పుడు అమ్మ చాలా బాధ పడింది .అయితే అప్పుడు నాన్న రాధిక నందు అనే రెండు రామ చిలుకల్ని తెచ్చిచ్చాడు .అమ్మకి అప్పటికి కూడా దుక్ఖం కుదర లేదు. అయితే అది రోజు రోజుకి దగ్గర అవతా అవతా అమ్మ వళ్ళోకి వచ్చేసేది .తరువాత నాన్నకి కోచ్ బీహార్ కి ట్రాన్స్ఫర్ అయింది .మాకు కోచ్ బిహార్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మా కొత్త నందు ను మేం వదిలేసాం .ఎందుకంటె దానికి రెక్కలోచ్చాయి ,దానికి మనసులో బాధేస్తుంది ఎగరాలని .అయితే రెండు వారాలకి రాధిక కు కూడా రెక్కలోచ్చేసినాయ్.సరే అని రాదికాని కూడా వదిలేసాం .ఇంకట్లో కథ ఆపేసా ఇదే మాకు జరిగిన కథ .నేను కథ ఆపేటప్పుడు ఒక మాట చెప్తా ఉండా.ఆ మాట ఏందంటే మీరు ఎప్పుడైనా చిలకల్ని పెంచుకునేటప్పుడు చిన్న బిడ్డ రామ చిలకల్ని తెచ్చుకుని చిన్నప్పట్నుండి పెంచుకోండి రెక్కల్ని కత్తి రించి ఎప్పుడు వాటిల్ని పంజరంలో పెట్టొద్దు ..ప్రియంవద
nijame gsk meenakshi garu chilakalani panjaram lo petti bandhinchakudadu.oka vela evaranna bandhinchina vallu chudakunda chusi manam vaatini vadileyali
ReplyDelete