అమ్మ మీద వ్యాసం !
అమ్మ చాలా మంచిది.అమ్మ చాలా మందికి చదువు చెప్పింది.అమ్మ బాగా చదువుకున్నది.అమ్మ చాలా పుస్తకాలు చదువుతుంది.అమ్మ నాకు చాల పుస్తకాలు కొనిచ్చింది,ఒక అల్మారా నిండుగా ...అమ్మ చాలా ధర్మవంతురాలు.అమ్మ నాకోసం పీహెచ్ డీ ,వుద్యోగం అన్నీ వదిలేసింది.ఇప్పుడు బెంగాల్ కి వచ్చిఉంటా వుంది. అమ్మ కుక్కల్ని,చిలకల్ని,ఆవుల్ని బాగా ప్రేమిస్తది.పైగా కప్పల్ని కూడా ప్రేమిస్తది.అనాధాశ్రమానికి కూడా డబ్బు ఇస్తది.లోకంలో అందరి మీదా రిచ్ పీపుల్ ,పూర్ పీపుల్, మిడిల్ పీపుల్ ..లోకం లో అందరి మీదా కథలు,కవితలూ రాస్తది.అమ్మ అస్సలు టీవీ చూడదు.అమ్మ చదువుకుంటా వుంటది.అమ్మ దగ్గర గాన్ విత్ ది విండ్ అని ఒక నవల వుంటది ,అమ్మకి అదంటే ఘోరంగా ఇష్టం.అమ్మకి ఇల్లు శుబ్రంగా ఉండటమంటే ఇష్టం.అమ్మకి నానంటే బాగా ఇష్టం.నానని చిన్న బిడ్డ లాగా చూసుకుంటది.అమ్మ నాకెప్పుడూ... నచ్చద్ది.అమ్మ ఫ్రెండ్ వినయ అంటె అమ్మకి చాలా ఇష్టం.ఇంకా శారద అనే ఫ్రెండు కూడా ఇష్టం .అమ్మకి పొడుగ్గా వుండే జడలంటే కూడా ఇష్టం.
అమ్మకి నేను లేకపోతే నిదర పట్టదు.అమ్మకి నేనంటే చాలా ఇష్టం.అమ్మకి నేను నాట్యం నేర్చుకుంటే చాలా ఇష్టం,చదువుకుంటే చాలా ఇష్టం.అమ్మకి నేను రచయిత్రి అవ్వాలని వుంటది.కానీ నాకు సైంటిస్ట్ అవ్వాలని ఇష్టం.అమ్మకి నేను లేకపోతే బతకలేదు.
ఇంక అమ్మ మీద చెప్పిన వ్యాసం ఖతమైంది..
ఇంక అమ్మ మీద చెప్పిన వ్యాసం ఖతమైంది..
బాగుంది బేబీ
ReplyDeleteఅమ్మకి మస్తు కోపం ,ఎవ్వడినైనా తుక్కు తుక్కు తన్నగలదని మరిచి పోయినవేందే?
ReplyDeleteకానీ అట్ట పెడితే బాగుండదేమో నానా .ఐ లవ్ యు నానా .ఎప్పుడోస్తావ్ నాన్నా .
ReplyDeleteబుజ్జిలూ
ReplyDeleteఇంత బుజ్జిగా ఉన్నప్పుడే అమ్మని ఎంత అర్థం చేసుకున్నావురా బంగారూ .అవునూ నానా చెప్పిన పాయింటు బానే వుంది కదా ,మంచి విషయమే కదా ?బాగుండదని ఎందుకన్నట్లూ ?పెద్దయ్యాకైనా నాకు బదులు చెప్పాలి ఏం...